Sunday, October 19, 2025
E-PAPER
Homeఖమ్మంగోడను పెకిలిస్తున్న కాంతమ్మ

గోడను పెకిలిస్తున్న కాంతమ్మ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: ప్రభుత్వం తనకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ఓ కాం ట్రాక్టర్ నాణ్యతా లేమితో  నిర్మించడం పై నిరసనగా లబ్ధిదారురాలు గునపం తో కూల్చి వేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని వేదాంతపురం గ్రామానికి చెందిన ఒంటరి మహిళ దాది కాంతమ్మ కు తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. ఈ ఇంటి నిర్మాణాన్ని ఓ కాంట్రాక్టర్ నిర్మించేందుకు ముందుకు రావడంతో ఒప్పందం చేసు కొని అప్పగించింది.ఇంటి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టా రాజ్యంగా నిర్మించడంతో కొద్ది రోజుల క్రితం బాధితురాలు ఇంటి నిర్మాణాన్ని నిలిపి వేసింది. 

ఆ తర్వాత ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తో పాటు ఇటీవల మండలంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,మాజీ ఎంపీపీ శ్రీరామమూర్తి దృష్టికి తీసుకెళ్లింది.ఎవరికి  చెప్పినా న్యాయం జరగలేదని శుక్రవారం బాధితురాలు గునపంతో ఇంటి గోడలను తొలగించింది. దీనిపై హౌసింగ్ ఏఈ మదన్ కుమార్ వివరణ కోరగా.. విషయం తన దృష్టికి వచ్చిందని, బాధితురాలి తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శనివారం స్థానిక కార్యదర్శి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంట్రాక్టర్ – కాంతమ్మ కు మధ్య ఒప్పందం కుదిర్చి తిరిగి నాణ్యతతో గోడలు నిర్మించే అంగీకారం కుదిర్చినట్లు ఏఈ మదన్ కుమార్ తెలిపారు. ఈ గ్రామంలో మొత్తం 18 గృహాలు మంజూరు అయ్యాయి.ఇందులో 10 మంది కాంట్రాక్టర్ తో నిర్మాణం చేయించుకుంటున్నారు.ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల కు అదనంగా మరో కొంత నగదు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.అయితే ఇసుక,ఇటుక,సిమెంట్ నాసిరకం కావడంతో నాణ్యత లోపించి నట్లు తెలుస్తుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -