Sunday, September 14, 2025
E-PAPER
Homeసినిమావిజువల్‌ వండర్‌గా 'కాంతార చాప్టర్‌ 1'

విజువల్‌ వండర్‌గా ‘కాంతార చాప్టర్‌ 1’

- Advertisement -

‘కాంతార’ వంటి సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ తరువాత హీరో, డైరెక్టర్‌ రిషబ్‌ శెట్టి ‘కాంతార చాప్టర్‌ 1’ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర మ్యూజిక్‌ ఆల్బమ్‌ కోసం నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, యాక్టర్‌ సింగర్‌ దిల్జిత్‌ దోసాంజ్‌ చేతులు కలిపారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్‌ను దిల్జిత్‌ షేర్‌ చేశారు. ‘బిగ్‌ బ్రదర్‌ రిషబ్‌ శెట్టి, మాస్టర్‌ పీస్‌ ‘కాంతార’ను రూపొందించినందుకు సెల్యూట్‌. ఈ సినిమాతో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది. ‘వరాహ రూపం’ పాట థియేటర్లలో చూసినప్పుడు, ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యాను. అజనీష్‌ లోక్‌నాథ్‌కు కతజ్ఞతలు. ఒక రోజులోనే తన నుంచి చాలా నేర్చుకున్నాను’ అని దిల్జిత్‌ పేర్కొన్నారు. ‘దిల్జిత్‌ దోసాంజ్‌, రిషబ్‌ శెట్టి పవర్‌ఫుల్‌ కాంబినేషన్‌తో హౌంబాలే ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెంచింది. ఇది విజువల్‌ విజువల్‌ వండర్‌గా ఉండబోతోంది. అర్వింద్‌ ఎస్‌.కాశ్యప్‌ సినిమాటోగ్రఫీ, బి.అజనీష్‌ లోక్‌నాథ్‌ మ్యూజిక్‌ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. హౌంబాలే ఫిలిమ్స్‌ విజరు కిరగందూర్‌ నెక్స్ట్‌ లెవల్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్‌లో అక్టోబర్‌ 2న భారీగా విడుదల కానుంది’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -