తేమ 20 శాతం వరకు సడలించాలి
టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
కేంద్రం పత్తి రైతులకై తెచ్చిన కపాస్ యాప్ ను రద్దు చేయాలనీ పత్తి కనుగొలులో తేమ శాతన్ని 20 శాతం వరకు సడలించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎడ్)రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశంను ఆదివారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బండారు రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అతివృష్టి కారణంగా రైతులు పంట దిగుబడి సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
రైతులు నష్ట పోయిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం లో సరైన నెట్వర్క్ ఇతర సదుపాయాలు ఇంకా లేనందున కపాస్ యాప్ తో పత్తి కనుగొలు పెట్టడం, ఆదివాసీ రైతులకు అవగాహన లేక టెక్నీకల్ ఇబ్బందులతో ప్రయివేట్ వ్యాపారులకు అమ్మే పరిస్థితి ఉంటుందని కావున పాత పద్దతిలో పత్తి కనుగొలు చేయాలనీ, కపాస్ యాప్ రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. పత్తి లో తేమ 20శాతం వరకు సడలించి కనుగొలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, ఉమ్మడి జిల్లా నాయకులు ఉయిక విష్ణు, తొడసం శంబు, కొట్నాక్ సక్కు, మడవి నాగోరావ్, అశోక్, ఆత్రం కిష్టన్న, కుంర భీంరావు బొజ్జ ఆశన్న పాల్గొన్నారు.
కపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



