- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ మండలంలోని కుచనపల్లి గ్రామంలో వర్షాలు కురవాలని బుధవారం గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు కప్పతల్లి ఆట ఆడారు. గ్రామదేవతలకు నీళ్లు పోస్తూ కప్పతల్లి ఆట ఆడుతూ మహిళలు నీళ్లు పోసుకుంటూ వార్డుల్లో తిరిగారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు ,గ్రామ శాఖ అధ్యక్షులు మామిడి రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెన్నరాజు పోలు సంపత్ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -