Monday, May 19, 2025
Homeసినిమానయా యాక్షన్‌ డ్రామాతో 'కరాలి'

నయా యాక్షన్‌ డ్రామాతో ‘కరాలి’

- Advertisement -

నవీన్‌ చంద్ర, రాశీ సింగ్‌, కాజల్‌ చౌదరి హీరో, హీరోయిన్లుగా మందలపు శివకష్ణ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘కరాలి’. మందలపు ప్రవల్లిక సమర్పణలో విక్రాంత్‌ ఫిల్మ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద ఈ మూవీకి రాకేష్‌ పొట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నిర్మాత సాహు గారపాటి, రాజా రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్‌కు సాహు గారపాటి స్క్రిప్ట్‌ అందజేసి, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. శ్రీహర్షిణి ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అధినేత గోరంట్ల రవికుమార్‌, యాస్పైర్‌ స్పేసెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తుమాటి నరసింహా రెడ్డి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు.
నవీన్‌ చంద్ర మాట్లాడుతూ,”కరాలి’ అనే టైటిల్‌ ఎంత కొత్తగా, డిఫరెంట్‌గా ఉందో సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇంత వరకు నేను చేయని ఓ డిఫరెంట్‌ యాక్షన్‌ డ్రామా. కాజల్‌ చౌదరి నటించిన ‘అనగనగా’ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీని ఆడియెన్స్‌ అంతా ఎంజారు చేసేలా రూపొందిస్తున్నాం’ అని అన్నారు. ‘నేను కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగిని. అక్కడ వీఆర్‌ఎస్‌ తీసుకుని సినిమాల మీద ప్యాషన్‌తో ఇంత వరకు కూడబెట్టుకున్న డబ్బులతో ఇక్కడకు వచ్చాను. నాకున్న ప్యాషన్‌తోనే ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేశాను. రాకేష్‌ పొట్ట చెప్పిన కథ చాలా నచ్చింది. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మిస్తాం. కొత్త యాక్షన్‌ మూవీని అందరి ముందుకు తీసుకు వస్తాం’ అని నిర్మాత మందలపు శివకష్ణ చెప్పారు. దర్శకుడు రాకేష్‌ పొట్టా మాట్లాడుతూ, ‘నన్ము నమ్మి అవకాశం ఇచ్చిన హీరో నవీన్‌చంద్ర, నిర్మాత శివకృష్ణకు థ్యాంక్స్‌’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -