Thursday, September 25, 2025
E-PAPER
Homeజిల్లాలుఆత్మస్థైర్యానికి కరాటే దోహదం 

ఆత్మస్థైర్యానికి కరాటే దోహదం 

- Advertisement -

మార్షల్ ఆర్ట్ తోనే గౌరవం 
సినీ రంగంలో ఒంటరి పోరాటం 
800 సినిమాల్లో నటించాను : ప్రముఖ సినీ నటుడు సుమన్ 
సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు 
నవతెలంగాణ – పాలకుర్తి

ఆత్మస్థైర్యానికి కరాటే దోహదపడుతుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ అన్నారు. గురు షాటో ఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో పాలకుర్తిలో నిర్వహించిన కరాటే శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో గల బషారత్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమానికి సుమన్ తల్వార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో కరాటే మాస్టర్ల విన్యాసాలను తిలకించారు. ఈ సందర్భంగా సుమన్ తల్వార్ మాట్లాడుతూ.. మానవ సమాజంలో మార్షల్ ఆర్ట్  ఎంతో గౌరవం ఉందని తెలిపారు. మార్షల్ ఆర్ట్ కు వయసుతో సంబంధం లేదని సూచించారు. జీవితంలో ముందుకు సాగాలంటే క్రమశిక్షణ అవసరమన్నారు. మార్షల్ ఆర్ట్ తోనే కరాటే మాస్టర్ కు గౌరవం దక్కుతుందని తెలిపారు. సినీ రగంలో ఒంటరి పోరాటం చేశానని, తల్లిదండ్రులు, అభిమానుల ఆశీస్సులతో ఎనిమిది వందల సినిమాల్లో నటించానని  తెలిపారు.

100 తెలుగు సినిమాల్లో కథానాయకునిగా నటించానని వివరించారు. కూటములు విజయానికి నాంది అవుతాయని తెలిపారు. మార్షల్ ఆర్ట్కు ఎప్పుడు ఓటమి ఉండదని, జీవితంలో విజయాలు ఎప్పటికీ ఉంటాయని తెలిపారు. శారీర ధారుఢ్యానికి, ఐక్యమత్యానికి, ఆత్మస్థైర్యానికి మార్షల్ ఆర్ట్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. గురువులను గౌరవించడం నేటి సమాజానికి ఆదర్శమన్నారు. గురు షాటో ఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో పాలకుర్తిలో నిర్వహించిన కరాటే శిక్షణ కార్యక్రమానికి పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అంతకుముందు మండల కేంద్రంలో గల శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతం ఎంతో చారిత్రాత్మకమైనదని అభిప్రాయపడ్డారు.

అనంతరం సినీ నటుడు సుమన్ తల్వార్ ను లయ అర్చకులు శేష వస్త్రాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతరావు, కరాటే ఆల్ ఇండియా అధ్యక్షుడు అసన్ ఇస్మాల్, కరాటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వూరుకొండ చంద్రశేఖర్, కరాటే మాస్టర్లు సోమ శ్రీధర్, గఫూర్, కాసిం, రుద్రమదేవి సెల్ఫ్ డిఫెండ్ అకాడమీ వ్యవస్థాపకురాలు షీ టీం లక్ష్మి, కళ్యాణి, ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు, ఆలయ ప్రధాన అర్చకులు  దేవగిరి లక్ష్మన్న, ఉప ప్రధాన అర్చకులు డివిఆర్ శర్మ, అర్చకులు దేవగిరి అనిల్ కుమార్ శర్మ, మత్తగజం  నాగరాజు శర్మ, సూపరింటెండెంట్  కొత్తపల్లి వెంకటయ్య తో పటు ఆలయ సిబ్బంది, కరాటే మాస్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -