Sunday, March 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకరీంనగర్‌ టూటౌన్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ ఆత్మహత్య

కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ- జమ్మికుంట
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ భార్య దివ్య కూడా ఈనెల 17న ఆత్మహత్య చేసుకుంది. దాంతో చంద్రశేఖర్‌ మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం తన అత్తగారి గ్రామమైన కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట మండలం సీతంపేటలో భార్య ఐదో రోజు కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడే ఇంట్లో చున్నీతో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని తమ్ముడు కార్తీక్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కాంత్‌ కుమార్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -