- Advertisement -
నవతెలంగాణ జమ్మికుంట : కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అత్తగారింట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల ఎస్సై భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. అంత్యక్రియల అనంతరం భార్య స్వగ్రామం సీతంపేటలోని అత్తగారింటికి ఎస్సై వచ్చాడు. భార్య మృతితో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ అత్తగారింట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -



