నవతెలంగాణ – శంకరపట్నం
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతిలో బుధవారం జరిగిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమంలో శంకరపట్నం మండలం, కరీంపేట గ్రామానికి చెందిన శ్రీ భక్తాంజనేయ భజన మండలి అరుదైన గుర్తింపును పొందింది. ఈ మండలి సభ్యులు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. కళాభారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 50కి పైగా భజన మండలి గ్రూపుల నుండి 1044 మంది భక్తులు పాల్గొని, 10 గంటల పాటు నిర్విరామంగా భజన గీతాలు ఆలపించారు. ఈ అద్భుతమైన ప్రదర్శనకు గాను ఈ కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ భక్తాంజనేయ భజన మండలి సభ్యుల పేర్లు కూడా ఈ రికార్డులో నమోదు అయ్యాయి. బుధవారం రాత్రి కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ నరెందర్ గౌడ్ సభ్యులకు పత్రాలను అందించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడంతో, భజన మండలి సభ్యులను గ్రామస్థులు, మండల ప్రముఖులు అభినందించారు.ఈ రికార్డులో స్థానం పొందిన ఇతర భజన మండళ్లలో కేశవపట్నం శ్రీ శివకేశవ భజన మండలి, ఎరడపల్లికి చెందిన శ్రీ రామానంద భజన మండలి, మరియు కన్నపూర్ శివరామకృష్ణ భజన మండలి సభ్యులు కూడా ఉన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులలో ఆడెపు శ్రీనివాస్, సంబు శ్రీనివాస్, గంపల బాలారాజు, రాసమల్ల శ్రీనివాస్, మెడిశెల్మల శ్రీనివాస్, ఏగుర్ల సంపత్, మెరుగు రాజు, గోపి శ్రీనివాస్, సంబు తిరుపతి, వనపర్తి ప్రశాంత్, మంతెన శ్రీనివాస్, ఆరె వీరయ్య, బొజ్జ లింగస్వామి, ఆడపు బాలరాజు, సంబు రవి, తీర్థాల మహేష్, ఎనుగుల భీరయ్య తదితరులు ఉన్నారు.
కరీంపేట భజన మండలికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అరుదైన గుర్తింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES