Sunday, March 15, 2026
E-PAPER
Homeఖమ్మంఘనంగా కార్ల్ మార్క్స్ 143వ వర్థంతి వేడుకలు

ఘనంగా కార్ల్ మార్క్స్ 143వ వర్థంతి వేడుకలు

- Advertisement -

సీపీఐ(ఎం) రాజకీయ విద్యా విభాగం జిల్లా కన్వీనర్ బండారు రమేష్ 
నవతెలంగాణ – బోనకల్

మార్క్సిజం యొక్క నిజమైన బలం సమాజాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుందని సీపీఐ(ఎం) జిల్లా అధ్యయనం కమిటీ కన్వీనర్ బండారు రమేష్, సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్లు మండల కేంద్రంలో గల  వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో కారల్ మార్క్స్ 143వ వర్ధంతి వేడుకలను సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కారల్ మార్క్స్ చిత్రపటానికి బండారు రమేష్, చింతలచెరువు కోటేశ్వరరావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కిలారు సురేష్, మండల కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సునీత, బంధం శ్రీనివాసరావు, దొండపాటి సత్యనారాయణ, గుగులోత్ నరేష్, తెల్లాకుల శ్రీనివాసరావు, పిల్లలమర్రి వెంకట అప్పారావు, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలంటే ఆయన మహతర గ్రంథం దాస్ క్యాపిటల్ చదవాలన్నారు. ప్రపంచానికి ప్రస్తుతం కారల్ మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ మార్గ నిర్దేశంగా మారిందన్నారు. 200 సంవత్సరాల క్రితమే దోపిడీ ఎలా ఉంటుంది, ఎలా నివారించాలని కారల్ మార్చ్ సవివరంగా వివరించారన్నారు. సమాజంలోనే సమస్యలను వ్యక్తుల వైఫల్యాలుగా కాకుండా వ్యవస్థలోనే వైరుధ్యాలుగా చూడాలని ఆయన సూచించారు అన్నారు. ఈ దృష్టి కోనమే ఆధునిక సామాజిక శాస్త్రాల అభివృద్ధికి కూడా పునాది వేసింది అన్నారు. ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం ఇలా అనేక రంగాలలో మార్క్స్ ఆలోచనలు ప్రభావం చూపుతున్నాయన్నారు.

ఒక వ్యక్తి ఆలోచనలు శతాబ్దాల పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేయటం సాధారణ విషయం కాదన్నారు. అది సాధ్యమవాలంటే ఆ ఆలోచనలు కాలాన్ని మించిన శక్తిని కలిగి ఉండాలన్నారు. ఒక సమాజం న్యాయసమ్మతంగా, సమానత్వంతో కూడినదగా మారాలని పోరాడే ప్రతి ఉద్యమంలో మార్క్స్ ప్రతిధ్వని వినిపిస్తుందన్నారు. అంతర్జాతీయ కార్పోరేట్ సంస్థలు అనేక దేశాల ప్రభుత్వాల కంటే ఎక్కువ ఆర్థిక శక్తిని సంపాదించాయన్నారు. టెక్నాలజీ సంస్థలు ఫైనాన్స్ సంస్థలు గ్లోబల్ పెట్టుబడులు ప్రపంచ మార్కెట్లను శాసిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పెట్టుబడి సరిహద్దులను దాటి సంచరిస్తున్నప్పటికీ దాని లాభాలు మాత్రం సమాజం అంతటికీ సమానంగా చేరటం లేదని కొద్ది మంది వ్యక్తులలో కేంద్రీయ కృతమై ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు జోనిబోయిన గురవయ్య, చేపూరి వెంకటేశ్వర్లు, కూచిపూడి మురళీకృష్ణ, తమ్మారపు లక్ష్మణరావు, బోయనపల్లి వీరబాబు, బూర్గుల అప్పాచారి, పెద్దపోలు కోటేశ్వరరావు, చింతలచెరువు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -