Wednesday, March 11, 2026
E-PAPER
Homeఆటలుకర్నాటక ముందంజ

కర్నాటక ముందంజ

- Advertisement -

ఉత్తరాఖాండ్‌తో రంజీ సెమీస్‌

లక్నో : ఉత్తరాఖాండ్‌తో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్నాటక తిరుగులేని ముందంజ వేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 736 పరుగులు చేసిన కర్నాటక.. రెండో ఇన్నింగ్స్‌లో 299/6తో ఆడుతోంది. రవి చంద్రన్‌ స్మరణ్‌ (127, 149 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో మెరువగా.. కృతిక్‌ కృష్ణ (52), కెఎల్‌ రాహుల్‌ (70 నాటౌట్‌) అర్థ సెంచరీలు సాధించారు. 63.5 ఓవర్లలో 6 వికెట్లకు ఆ జట్టు 299 పరుగులు చేసింది. అంతకుముందు ఉత్తరాఖాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 88.5 ఓవర్లలో 233 పరుగులకు కుప్పకూలింది. నాల్గో రోజు ఆట ముగిసే సరికి కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 802 పరుగుల ముందంజలో కొనసాగుతుంది. రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో నేడు ఆఖరు రోజు ఆట. తొలి ఇన్నింగ్స్‌లో 503 పరుగుల భారీ ఆధిక్యం సాధించినా ఫాలో ఆన్‌ ఆడించని కర్నాటక.. నేడు సైతం ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్‌ ఇచ్చే సూచనలు కనిపించటం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -