నవతెలంగాణ – ఆర్మూర్
సమాజంలో వినాయక ఉత్సవాలు ప్రారంభమైతే ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ తో వివిధ రకాల హాని కలి గించే రంగులతో వినాయక విగ్రహాలను తయారు చేయడం వలన పర్యావ రణం కలుషితమవు తుంది. అందుకు భిన్నంగా పర్యావ రణాన్ని పరి రక్షిం చాలన్న ఉద్దేశంతో మండలం లోని మంతిని గ్రామానికి చెందిన హనుమాన్ యూత్ సభ్యు లు కర్ర మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. గత 35 ఏళ్ల నుండి హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని, 12 సంవత్సరాల నుండి పర్యావ రణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుని ఏర్పాటు చేసి డీజే శబ్దాలు లేకుండా భజన కార్యక్రమాలతో సాంప్ర దాయకంగా గణేష్ ఉత్సవాలను నిర్వ ర్తిస్తున్నామని అన్నారు.
ప్రతి సంవత్సరం మట్టి వినాయక విగ్ర హాల తయారీకి ప్రతి సంవత్సరం వేలాది రూపాయిలు ఖర్చు అవుతుండగా కర్ర గణపతి వలన ఆ భారం తగ్గుతుందని అన్నారు. గ్రామస్తుల సహకారంతో రూ.1.70 వేలకు విగ్ర హాన్ని తయారు చేయించడం జరిగిం దని తెలి పారు. పాలజ్ గణేష్ ను ఆదర్శంగా తీసుకొని నిర్మల్ కళాకారుడు వజ్రం చారి దగ్గర కర్ర గణ పతి ని చేయించామని అన్నారు. తొమ్మిది రోజు లు పూజలు, నిత్య అన్నదానం చేసి మహా గణ పతిని ర్యాలీగా ఊరేగించి మళ్లీ తిరిగి ఇక్కడే భద్ర పర్చుతా మని యూత్ సభ్యులు వివరించారు. ఇలానే ప్రజలందరూ పర్యావరణాన్ని కాపాడుతూ ఉత్సవాలను చేసుకోవాలని వారు సూచించారు.