ముఖ్య అతిథులుగా యూరోపియన్ సభ్యులు ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లేయన్ హాజరు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సోమవారం నాడు దేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్తవ్యపథ్ నుండి ఈ వేడుకలకు ప్రారంభిస్తారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి జాతీయ యుద్ధ స్మారకచిహ్నం వరకు విస్తరించి ఉన్న కర్తవ్య పథ్ 150 ఏండ్ల జాతీయ గీతం వందేమాతరం, దేశ అపూర్వమైన పురోగతి, బలమైన సైనిక పరాక్రమం, దాని గొప్ప సాంస్కృతిక వైవిధ్యం, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో కూడిన మరపురాని సమ్మేళనాన్ని ప్రదర్శించడానికి అలంకరించారు.
ఉదయం 10.30 గంటలకు పరేడ్ ప్రారంభమై దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడ ఆయన దేశానికి నాయకత్వం వహించి అమరవీరులకు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పిస్తారు. ఆ తరువాత ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులు కవాతును వీక్షించడానికి కర్తవ్య పథ్ వద్ద ఉన్న వందన వేదిక వద్దకు వెళతారు.
రాష్ట్రపతి, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ‘సాంప్రదాయ గుర్రపు బగ్గీ’లో రాకపోకలకు సైన్యంలోని అత్యంత సీనియర్ రెజిమెంట్ అయిన ప్రెసిడెంట్స్ బాడీగార్డ్ రక్షణ కల్పిస్తారు. సంప్రదాయం ప్రకారం, జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. దాని తరువాత దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఫిరంగి ఆయుధ వ్యవస్థ అయిన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్ ఉపయోగించి 21-గన్ సెల్యూట్స్‌తో జాతీయ గీతం వినిపిస్తుంది. ఈ గన్ సెల్యూట్స్‌ను 172 ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన 1721 సెరిమోనియల్ బ్యాటరీ ప్రదర్శిస్తుంది.
‘వివిదతా మే ఏక్తా – వైవిధ్యంలో ఏకత్వం’ అనే ఇతివృత్తంతో జరిగే ఈ పరేడ్ లో 100 మంది సాంస్కృతిక కళాకారులు పాల్గొంటారు. ఈ పరేడ్ దేశ ఐక్యత, గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే సంగీత వాయిద్యాల గొప్ప ప్రదర్శనగా ఉండబోతోంది. ధ్వజ్ ఫార్మేషన్‌లోని 129 హెలికాప్టర్ యూనిట్స్‌కు చెందిన నాలుగు ఎంఐ-171 హెలికాప్టర్లు పూల రేకుల వర్షం కురిపిస్తాయి. జాతీయ జెండాను ఎగురవేస్తూ, ఈ హెలికాప్టర్ల ఏర్పాటుకు గ్రూప్ కెప్టెన్ అలోక్ అహ్లవత్ నాయకత్వం వహిస్తారు.
ఆ తరువాత రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించడంతో పరేడ్ ప్రారంభమవుతుంది. పరేడ్‌కు ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్, రెండో తరం అధికారి లెఫ్టినెంట్ జనరల్ భావ్ నీష్ కుమార్ నాయకత్వం వహిస్తారు. ఢిల్లీ ఏరియా ప్రధాన కార్యాలయం చీఫ్ ఆఫ్ స్టాఫ్, మూడో తరం ఆర్మీ అధికారి మేజర్ జనరల్ నవరాజ్ ధిల్లాన్ పరేడ్‌కు సెకండ్-ఇన్-కమాండ్‌గా ఉంటారు.
అత్యున్నత శౌర్య పురస్కారాలను సొంత చేసుకున్న విజేతలు తరువాత వస్తారు. వారిలో పరమ వీర చక్ర విజేతలు – సుబేదార్ మేజర్ (గౌరవ కెప్టెన్) యోగేంద్ర సింగ్ యాదవ్ (రిటైర్డ్), సుబేదార్ మేజర్ సంజరు కుమార్, అశోక్ చక్ర విజేతలు మేజర్ జనరల్ సిఎ పితావాలియా (రిటైర్డ్), కల్నల్ డి. శ్రీరామ్ కుమార్ ఉన్నారు.
యూరోపియన్ యూనియన్ కంటింజెంట్
యూరోపియన్ యూనియన్ (ఈయూ) బృందంలో మూడు జిప్‌లపై నలుగురు జెండా మోసేవారు ఉంటారు. వారు నాలుగు జెండాలను మోసుకెళ్లి కనిపిస్తారు. యూరోపియన్ యూనియన్ అత్యంత గుర్తించదగిన చిహ్నమైన ఈయూ జెండా, యూరోపియన్ యూనియన్ మిలిటరీ స్టాఫ్ జెండా, ఈయు నావల్ ఫోర్స్ అట్లాంటా జెండా, ఈయూ నావల్ ఫోర్స్ ఆస్పిడ్స్ జెండాను తీసుకెళ్తారు.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్తవ్యపథ్ ముస్తాబు
- Advertisement -
- Advertisement -



