Sunday, October 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకార్తీక దీపోత్సవాన్ని కన్నుల పండుగగా జరపాలి

కార్తీక దీపోత్సవాన్ని కన్నుల పండుగగా జరపాలి

- Advertisement -

ఎండోమెంట్‌ అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కార్తీక దీపోత్సవాన్ని కన్నుల పండగలా నిర్వహించాలనీ, రాష్ట్రంలోని ప్రతి దేవాలయం దీపాలతో అలకరించాలని ఎండోమెంటు ఉన్నతాధికారులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఈ ఏడాది కార్తీక దీపోత్సవం 22 నుంచి 19 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ఎండోమెంటు ఉన్నతాధికారులు శైలజ రామయ్యర్‌, హరీశ్‌, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంటు కమిషనర్లు, ఈవోలతో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల ఈవోలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈ సంవత్సరం కూడా సామూహిక కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించుటకు దేవాదాయ శాఖ చేసే ఏర్పాట్లను మంత్రికి అధికారులు వివరించారు. ప్రతిరోజు సామూహిక కార్తీక దీపోత్సవాన్ని సాయంత్రం 6గంటల నుండి జరపాల్సి ఉంటుందనీ, ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు మట్టి ప్రమిదలు, వత్తులు, నూనెతో పాటుగా పసుపు కుంకుమ తాంబూలాలను మహిళా భక్తులకు అందచేస్తున్నట్టు వివరించారు. కార్తీక సోమవారం నాడు సామూహిక కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పైన పేర్కొన్న వస్తువులతో పాటు కుంకుమ, పసుపు, ఆకులు, వక్కలు, ఏదైనా పండు, కనుము ప్రధాన దేవాలయలలో భక్తులకు ఇస్తున్నట్టు తెలిపారు. సామూహిక కార్తీక దీపోత్సవంలో భక్తులు దీపాలు ఒదలటానికి అవసరమైనచోట తాత్కాలిక వాటర్‌ పాండ్స్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. నదీ పరివాహక ప్రాంతాలలోని దేవాలయాలలో నది హారతి నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారో… అక్కడ స్థానికంగా రెవెన్యూ, పోలీసు, ట్రాఫిక్‌ విభాగాల సాయంతో చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మహిళలు, ఇతర భక్తులకు మంచి నీటి వసతి కల్పించాలన్నారు. శానిటేషన్‌ వర్కర్స్‌ సేవలు వినియోగించుకోని ఆలయ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. గత అనుభవాల ఆధారంగా ముందుకు వెళ్ళాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు కూడా ఏదో ఒక రోజు పాల్గొనే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మంత్రి ఎండోమెంటు అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -