నవతెలంగాణ – మల్హర్ రావు:
కార్తీక మాసం సందర్భంగా భూపాలపల్లి-పెద్దపల్లి రెండు జిల్లాల సరిహద్దు,మానేరు ప్రక్కనున్న పురాతన కాకతీయ రాజుల నాటి 750-1323 రామలింగేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు బుధవారం ఆలయ చైర్మన్ ఇందారపు లక్ష్మీ, వైస్ ఛైర్మన్ చిలుక రాధిక ఆధ్వర్యంలో అంగరంవైభవంగా నిర్వహించారు.శివాలయంలో సప్తమ మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కాకడా హారతులు ముగింపు,అభిషేకాలు నిర్వహించారు.ఆలయం పూలు,ద్విపాలతో సర్వాంగసుందరంగా ఏర్పాట్లు చేశారు.శివాలయాలు భక్తుల నామస్మరణతో మార్మోగాయి.ఆధ్యాత్మికతోనే ప్రశాంతత ఉంటుందని పలువురు వేదపండితులు తెలిపారు.స్వామివారి ఆశీస్సులతో పంటలు పండాలని, పాడి, ప్రజలు సుభిక్షంగా ఉండాలని పండితులు ఆకాంక్షించారు.ఈ ఉత్సవాల్లో పెద్దయెత్తున సందర్శకులు హాజరయ్యారు.
చంద్రవెళ్లిలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



