Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్తీకమాస ఉత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే 

కార్తీకమాస ఉత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
కార్తీక మస ఉత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆలయ అధికారులను ఆదేశించారు. కార్తిక మాస ఉత్సవాల వాల్పోస్టర్ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శుక్రవారం హైదరాబాదులో గల ఎమ్మెల్యే నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ కార్తీక మాస ఉత్సవాలను నిర్వహించడంలో సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉందని తెలిపారు. అదే స్ఫూర్తితో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చేందుకు ప్రచారం నిర్వహించాలని సూచించారు.

నవంబర్ ఐదు న కార్తీక పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షణ, లక్ష దీపోత్సవం, అఖండ జ్యోతి దర్శనం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని, ఎలాంటి లోపాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గిరి ప్రదక్షణ సందర్బంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, ఆలయాన్ని అలంకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఆలయ ఈవో  సల్వాది మోహన్ బాబు , సూపర్డెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ అర్చకులు  డివిఆర్ శర్మ,ఆలయ సిబ్బంది  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -