Friday, March 20, 2026
E-PAPER
Homeసినిమా'కరుప్పు' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘కరుప్పు’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

కథానాయకుడు సూర్య నటిస్తున్న మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘కరుప్పు’. దర్శకుడు ఆర్జే బాలాజీ. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్‌ కంటెంట్‌ను అందించిన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని స్కేల్‌, కంటెంట్‌ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది. సూర్య పవర్‌ఫుల్‌ అవతార్‌లో కనిపించిన ‘కరుప్పు’ ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ సంచలనం క్రియేట్‌ చేసింది. తాజాగా మేకర్స్‌ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేశారు. మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – జికె విష్ణు, సంగీతం – సాయి అభ్యంకర్‌, యాక్షన్‌ – అన్బరివ్‌, విక్రమ్‌ మోర్‌, ఎడిటర్‌ – ఆర్‌.కళై వానన్‌, నిర్మాతలు: ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -