Sunday, October 5, 2025
E-PAPER
Homeజాతీయంకరూర్‌ సిట్‌ విచారణలోనిజం వెల్లడవుతుంది : స్టాలిన్‌

కరూర్‌ సిట్‌ విచారణలోనిజం వెల్లడవుతుంది : స్టాలిన్‌

- Advertisement -

చెన్నై : కరూర్‌ తొక్కిసలాట ఘటనపై మద్రాస్‌ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ ప్రారంభిస్తుందని, ఈ విచారణ ద్వారా సిట్‌ నిజాన్ని వెలికితీస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు స్టాలిన్‌ శనివారం ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ‘ప్రతీ స్థాయిలోనూ జవాబుదారీతనం నిర్ణయమవుతుంది’ అని స్టాలిన్‌ తెలిపారు. అలాగే, అనేక అంశాల్లో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉందని, జనసమూహ సంబంధిత ప్రమాదాలను నివారించడంలోనూ దేశానికి నాయకత్వం వహిస్తుందని అన్నారు. ఈ ప్రమాదాలను నివారించడానికి సమగ్ర స్టాండర్డ్‌ ఆపపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపి)ను రూపొందించడానికి నిపుణులు, పార్టీల ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో చర్చలు జరుపుతామని చెప్పారు.

ఈ ఫ్రేమ్‌వర్క్‌ కేవలం తమిళనాడుకు మాత్రమే కాకుండా, యావత్తు దేశానికే ఒక నమూనాగా ఉపయోగపడుతుందని స్టాలిన్‌ తన పోస్టులో తెలిపారు. అలాగే కరూర్‌ విషాదంపై రాజకీయ నిందలు వేయకుండా, దీర్ఘకాలిక పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామని స్టాలిన్‌ పిలుపునిచ్చారు. కరూర్‌ విషాదానికి సంబంధించి హైకోర్టు జారీ చేసిన అన్ని పరిశీలనలు, మార్గదర్శకాలను పరిగనణలోకి తీసుకుని తమిళనాడు ప్రభుత్వం అత్యంత గంభీరంగా వ్యవహరిస్తుందని స్టాలిన్‌ తెలిపారు. ఘటనలో బాధితులైన ప్రతీ కుటుంబం కన్నీళ్లను చూసి తాను బాధపడినట్లు స్టాలిన్‌ ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -