నవతెలంగాణ – హైదరాబాద్
ఇంటర్‌స్టేట్ రెజ్లింగ్ పోటీలలో హైదరాబాద్‌కు చెందిన కాసోజీ సిద్ధుచారీకి బంగారు పతకం లభించింది. ఓల్డ్‌సిటీలోని సబ్జీమండీలో గల గంగపుత్ర మైదానంలో గత వారం పాటుగా ఇంటర్‌స్టేట్ రెజ్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో 74 కేజీల విభాగంలో జరిగిన పోటీలలో కాసోజీ సిద్ధుచారీ పోటీ పడ్డాడు. ఈ అండర్-19 పోటీలో హైదరాబాద్, సికిందరాబాద్‌లకు చెందిన రెజ్లర్లతో సిద్ధుచారీ పోటీ పడ్డాడు. ఈ పోటీలో ఇద్దరిని మట్టికరిపించిన సిద్ధుచారీ స్టేట్ ఫస్ట్‌గా నిలిచాడు. దీంతో ఈ పోటీల నిర్వాహక చైర్మెన్ శ్రీనివాస్.. విజేతకు బంగారు పతకాన్ని అందించారు. త్వరలోనే హర్యానాలో జరగనున్న ఆలిండియా రెజ్లింగ్ పోటీలకు సిద్ధుచారీ ఎంపికైనట్టు ప్రకటించారు. చుడిబజార్ జైన్‌మందిర్‌కు చెందిన సిద్ధుచారీ.. ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.
రెజ్లింగ్‌లో కాసోజి సిద్ధుచారీకి బంగారు పతకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



