– నాణ్యత లేని భోజనంపై జడ్జ్ ఆగ్రహం
నవతెలంగాణ – ఝరాసంగం
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని జహీరాబాద్ సివిల్ కోర్ట్ సీనియర్ న్యాయమూర్తి కవితా దేవి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యాలయంలో చదువుతున్న పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన బాలికలకు సరియైన ఆహారాన్ని అందించకపోవడం పట్ల విద్యాలయం ప్రిన్సిపల్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని రుచి చూడగా సరియైన న్యానేత లేదని అన్నారు. వంటగది, కూరగాయలను, విద్యాలయ పరిసరాలు పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేతకి సంగమేశ్వర ఆలయం సందర్శించి స్వామివారి దర్శించుకున్నారు. తహసిల్దార్ కార్యాలయం సందర్శించి ఉచిత న్యాయ సేవ కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కస్తూర్బా గాంధీ పాఠశాల ఆకస్మిక తనిఖీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



