నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2026 సిఎం కప్ ఆటల్లో మండల, జిల్లా స్థాయిలో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు మండలంలోని దుబ్బపేట గ్రామ కస్తూర్బా పాఠశాల విద్యార్థినీలు ఎంపికైనట్లుగా పాఠశాల ప్రత్యేకాధికారి ఎం.భవాని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇటీవల జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో అథ్లెటిక్స్ సెలక్ట్ లో అండర్ 18 గర్ల్స్ షాట్ పుట్ లో ఎం.మహేశ్వరి జిల్లా స్థాయిలో ప్రధమ స్థానం,అండర్ 18 గర్ల్స్ లాంగ్ జంప్ లో ఎం.మహేశ్వరి ప్రథమస్థానం, పి.లక్ష్మి ద్వితీయ స్థానం,ఎన్ శ్రావణి తృతీయ స్థానాలను గెలుచుకున్నట్లుగా తెలిపారు.
అండర్ 18 రన్నింగ్ 100 మీటర్ల పరుగు పందెంలో ఎం.మహేశ్వరి ప్రథమ స్థానం,ఎం శ్రావణి ద్వితీయ స్థానం గెలుచుకున్నట్లుగా.. అండర్ 16 గర్ల్స్ రన్నింగ్ 600 మీటర్ల పరుగు పందెంలో అక్షిత ద్వితీయ స్థానాలు గెలుచుకోని వీరంతా రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. గెలుచుకోని, రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను, వీరిని ప్రోత్సహించిన పిఈటి ఉపాధ్యాయురాలు సంగీతను ప్రత్యేకారి అభినందించారు.



