Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాన్సువాడ పుర చైర్మన్ గా కాసుల విజయ

బాన్సువాడ పుర చైర్మన్ గా కాసుల విజయ

- Advertisement -

నవతెలంగాణ-బాన్సువాడ (నసురుల్లాబాద్)
బాన్సువాడ  మున్సిపాలిటీలో జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 29 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 11 వార్డులు గెలుచుకోగా, బీఆర్ఎస్ 3 వార్డులు, బీజేపీ 3 వార్డులు, ఏం ఐ ఎం పార్టీ 1 వార్డు స్వతంత్ర అభ్యర్తి 1 వార్డుల్లో గెలుపొందారు. ఈరోజు ఉదయం 11 గంటలకు గెలుపొందిన కౌన్సిలర్ల సమక్షంలో ఎన్నికల స్పెషల్ అధికారి,  బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి  ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. బీజేపీ 3 వార్డులు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నికలో పాల్గొనలేదు. దీనితో  చైర్మన్  పదవికి  కాసుల వార్ విజయ బాలరాజ్ నామినేషన్ దాఖలు చేశారు.

ఆయనకు రాజశేఖర్  ప్రతిపాదకుడిగా, రమేష్ బలపరిచారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో కాసుల విజయ బాలరాజ్ ను  చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అదేవిధంగా వైస్ చైర్మన్ పదవికి రేష్మ బేగం నామినేషన్ దాఖలు చేయగా, హకీమ్ ప్రతిపాదకుడిగా, శ్యామల బలపరిచారు. ఈ పదవికి కూడా ఒకే నామినేషన్ రావడంతో రేష్మ బేగం ఎజాజ్ వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ఇద్దరితో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి కౌన్సిలర్లు సమష్టిగా పనిచేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా చైర్మన్ కాసుల విజయ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్ సహకారం,నూతన పాలకవర్గంతో కలసి  పట్టణ అభివృద్ధికి , మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.నూతనంగా ఎన్నికైన చైర్మన్ కాసుల విజయ బాలరాజ్, వైస్ చైర్మన్ రేష్మ బేగం ఎజాజ్ లను మాజీ టిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మరియు  పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -