Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం అందించాలి

కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం అందించాలి

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
కల్లుగీత వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని కల్లుగీత కార్మిక సంఘం మండల కార్యదర్శి వేముల లింగస్వామి గౌడ్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నవంబర్ 28న గీతన్నల రణభేరి కరపత్రాన్ని మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కల్గీత కార్మికులకు 4 వేలు పింఛన్, ఎక్స్గ్రేషియా 10 లక్షలకు పెంచాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న గీత కార్మికుల ఎక్స్గ్రేషియా డబ్బులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భర్త చనిపోయిన గీత కార్మికుడి భార్యకు వెంటనే పింఛన్ ను వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 28 న సూర్యాపేటలో నిర్వహించే గీతనుల రణభేరికి గీత కార్మికులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, వి.ముత్యాలు, అయితగోని మల్లేష్ గౌడ్ , బొడ్డు పెద్ద చంద్రమౌళి గౌడ్ , కాటం అంజయ్య గౌడ్, వేముల వెంకన్న గౌడ్ సిహెచ్ బిక్షం, సైదులు , యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -