Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారం డివిజన్ సర్పంచ్‌ల ఫోరం ఏర్పాటు

కాటారం డివిజన్ సర్పంచ్‌ల ఫోరం ఏర్పాటు

- Advertisement -

అధ్యక్షులుగా పంతకాని సడవలి
నవతెలంగాణ – కాటారం

కాటారం డివిజన్ బీఆర్‌ఎస్ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులుగా కాటారం గ్రామ సర్పంచ్ పంతకాని సడవలి ఎన్నికయ్యారు. సోమవారం మంథని రాజగృహంలో నిర్వహించిన సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా పంతకాని సడవలి మాట్లాడుతూ ఇటీవల ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో కొన్ని గ్రామపంచాయతీలపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన కొన్ని గ్రామాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు.
ఉపాధి హామీ పథకం పనులు ఏ గ్రామంలో జరిగితే ఆ గ్రామానికి ఆ పథకం ద్వారా నిధులు కేటాయించాల్సి ఉంటుందని, కానీ కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పార్టీల పేరుతో వివక్ష చూపుతోందని విమర్శించారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని చెబుతూ, ఆ గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం ఈ సర్పంచ్‌ల ఫోరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడ ఏ సర్పంచ్‌కు సమస్య వచ్చినా ఫోరం తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
కాటారం డివిజన్ బీఆర్‌ఎస్ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా కాటారం సర్పంచ్ పంతకాని సడవలి, ప్రధాన కార్యదర్శిగా దుబ్బపేట సర్పంచ్ భూక్య రవీందర్ నాయక్, ఉపాధ్యక్షుడిగా స్థంభంపల్లి పీపీ సర్పంచ్ జంగిడి కీర్తనలను ఎన్నుకున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -