నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) నూతన కమిటీ ఎన్నికలు శుక్రవారం విజయవంతంగా నిర్వహించబడ్డాయి. మండల కౌన్సిల్ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐత తిరుపతి రెడ్డి అధ్యక్షతన, ఎన్నికల అధికారి ఎ. భోజ్యా నాయక్, ఎన్నికల పరిశీలకులు సుదర్శనం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులుగా బానోత్ రాజు నాయక్, ప్రధాన కార్యదర్శిగా కొలుగూరి మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జి. ఫణిధర్, యం. నాగరాజు (TSMS), జి. శైలజ (TGWRS) ఎన్నిక కాగా, కార్యదర్శులుగా యం. వెంకటస్వామి, పి. కవిత (KGBV), బి. గణపతి నాయక్, పి. నర్సయ్య బాధ్యతలు చేపట్టారు.
జిల్లా కౌన్సిలర్లుగా ఎ. లక్ష్మణ్ నాయక్, ఎ. భాగ్యలక్ష్మి, జె. కరుణాకర్ రావు, పి. రమణ రెడ్డి, ఎ. భోజ్యా నాయక్, జె. రాజన్న, కె. రాజేశం ఎంపికయ్యారు. ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా ఎ. కృష్ణవేణి, సభ్యులుగా కె. కల్పన, ఎం.డి. పర్వీన్ నియమితులయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి ఐత తిరుపతి రెడ్డి, నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం వెంటనే PRC, పెండింగ్ DAలు విడుదల చేయాలని, అలాగే సెన్సస్ విధుల్లో సీనియారిటీ ప్రాతిపదికన బాధ్యతలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడితే పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా లక్ష్మణ్ నాయక్, జె. కరుణాకర్ రావు తదితరులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.



