Friday, February 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారం గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశం 

కాటారం గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశం 

- Advertisement -
  • వివిధ అంశాలపై చర్చించిన సర్పంచి, పాలకవర్గం..
  • నవతెలంగాణ – కాటారం
  • కాటారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచి పంతకాని సడవలి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా వార్డు సభ్యులు సర్పంచి తో కలిసి కీలక అంశాలపై చర్చించారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, వీధి దీపాల ఏర్పాటు మరియు పాడైన స్ట్రీట్‌లైట్ల మరమ్మతులు,అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సమావేశంలో తీర్మానించారు.

అర్హులైన పేదలకు పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చర్చించారు. అంతేకాకుండా గ్రామంలో పెరుగుతున్న కోతుల సమస్య, రోడ్లపై ఆవులు, గేదెలు తిరుగుతూ ట్రాఫిక్‌కు మరియు ప్రజల భద్రతకు ఇబ్బందులు కలిగిస్తున్న అంశాలపై కూడా చర్చించి, తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ కొండగొర్ల బాణయ్య, కార్యదర్శి షాగీర్ ఖాన్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -