Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంథని సీఎంకప్‌ పోటీల్లో కాటారం క్రీడాకారుల ఘన విజయం

మంథని సీఎంకప్‌ పోటీల్లో కాటారం క్రీడాకారుల ఘన విజయం

- Advertisement -

గోల్డ్ మెడల్‌తో ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన బాలికల జట్లు
నవతెలంగాణ- కాటారం

మంథని నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో కాటారం మండల బాలికల జట్లు అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్‌తో పాటు ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకొని ఘన విజయం సాధించాయి. శనివారం మంథని లో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో కబడ్డీ, కోకో, వాలీబాల్ విభాగాల్లో మొత్తం పది మండలాల జట్లు పోటీపడ్డాయి. తీవ్ర పోటీ మధ్య కాటారం మండల జట్లు అత్యుత్తమ ఆటతీరుతో ప్రత్యర్థులను మట్టికరిపించి బాలికల విభాగంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాయి.

ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా యువజన క్రీడల అధికారి (DYSO) సురేష్, మంథని ఎంపీడీవో శ్రీజ, టోర్నమెంట్ ఇన్చార్జి కొమురోజు శ్రీనివాస్ కాటారం క్రీడాకారుల ప్రతిభ అభినందనీయమని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయికి ఎదగగల క్రీడాకారులు వెలిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ పోటీల విజయానికి మండల కన్వీనర్ గురుసింగ విజయలక్ష్మి, PETలు మంతెన శ్రీనివాస్, కోచ్ వెంకటేష్, శ్రీధర్, మజిమ రాజేశ్వరి, రాధా, వీరన్న, శ్రీవిద్యతో పాటు వివిధ పాఠశాలల PETలు కీలక పాత్ర పోషించారని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -