నవతెలంగాణ – కాటార
కాటారం మండల కేంద్రంలో సీనియర్ క్రీడాకారుడు మేకల అశోక్ (అప్పి) గారి స్మారక “కాటారం ప్రీమియర్ లీగ్” కాటారం (గ్రామపంచాయతీ స్థాయి) క్రికెట్ టోర్నమెంట్ను (జి సి ఏ )గారెపల్లి క్రికెటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జి సి ఏ క్రికెట్ క్రీడాకారులు మాట్లాడుతూ.. మేకల అశోక్ గారు చాలా మంచి క్రీడాకారుడు అని మేము చిన్నవయసులో అప్పి క్రికెట్ ఆడుతుండగా అతని ఆటను చూసి చాలా నేర్చుకున్నామని అన్నారు. అంతే కాకుండా మాలాంటి చాలామంది క్రీడాకారులకు క్రికెట్ పట్ల అవగాహన కల్పించిన గొప్ప క్రికెట్ క్రీడాకారుడు అన్నారు. మేకల అశోక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరంమని, మేకల అశోక్ ఒక గొప్ప క్రికెట్ క్రీడాకారుడు కొనియాడారు.
వారి పేరు తో ఇలా క్రికెట్ టోర్ని పెట్టడం చాలా బాధాకరం మని వారిని గుర్తుచేసుకున్నారు. తోటి క్రీడాకారుని అకాల మరణం మమ్మల్ని ఎంతగానో కలిచి వేసిందని, వారు భౌతికంగా మా నుండి దూరమైన క్రీడాకారుల మనసులో వారు చిరస్థాయిగా నిలిచిపోతారని తెలియజేశారు.