Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారం సబ్ డివిజన్ ఎంసీపీఎఫ్ కమిటీ ఏర్పాటు

కాటారం సబ్ డివిజన్ ఎంసీపీఎఫ్ కమిటీ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
మండల కేంద్రంలోని రివైవ్ చర్చి ప్రాంగణంలో మంథని ఎంసీపీఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు ఐతు డేవిడ్ ఆధ్వర్యంలో కాటారం సబ్ డివిజన్ కమిటీని ఏర్పాటు చేసి ఐదు మండలాలకు చెందిన పాస్టర్స్ సమక్షంలో  కొత్త కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కాటారం సబ్ డివిజన్ అధ్యక్షుడిగా పప్పుల అబ్రహం, ఉపాధ్యక్షుడిగా జి. శామ్యూల్, కార్యదర్శిగా సి.హెచ్. చందు, ప్రధాన కార్యదర్శిగా ఆరమళ్ల దైవకృపాకర్, కోశాధికారిగా ఏకు సతీష్ కుమార్, సహా కోశాధికారిగా ఎం. పీటర్ ఎంపికయ్యారు. గౌరవ సలహాదారులుగా రొడ్డ యోహాను, దయాకర్‌లను నియమించారు.

అనంతరం  అధ్యక్షుడు ఐతు డేవిడ్ మాట్లాడుతూ…నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంథని–కాటారం సబ్ డివిజన్ పరిధిలోని చర్చిల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో మంథని మెయిన్ డివిజన్ ఎంసీపీఎఫ్ కమిటీ ప్రధాన కార్యదర్శి అశోక్ కన్నూరి, కోశాధికారి ఆరమళ్ల దైవకృపాకర్‌తో పాటు ఐదు మండలాల పాస్టర్స్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -