బ్రహ్మాజీ, ‘కమిటీ కుర్రోళ్ళు’ యశ్వంత్ పెండ్యాల లీడ్ రోల్స్‌లో ప్రసన్న కుమార్ నాని దర్శకత్వంలో రూపొందనున్న ఇంటెన్స్ న్యూ ఏజ్ క్రైమ్ థ్రిల్లర్ ‘కథకళి’. మాన్యత ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవికిరణ్ కలిదిండి నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమా లతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. నిహారిక కొణిదెల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. హర్షిత్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. బ్రహ్మాజీ స్క్రిప్ట్ అందించగా, ఫస్ట్ షాట్‌కి డైరెక్టర్ ప్రసన్న కుమార్ నాని దర్శకత్వం వహించారు. మధు దామరాజు, మైమ్ మధు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ,’మాన్యతా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ఈ కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో కథ హీరో. కాన్సెప్ట్ చాలా బాగుంది’ అని తెలిపారు. ‘మంచి ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో వస్తున్నాం నెక్స్ట్ మంత్ షూట్ స్టార్ట్ కాబోతోంది’ అని డైరెక్టర్ ప్రసన్న కుమార్ నాని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ, ‘బ్రహ్మాజీ ఇందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని అన్నారు. యశ్వంత్ మాట్లాడుతూ,’ఈ సినిమాలో హీరోలు ఎవరు ఉండరు. ఈ సినిమాకి హీరో కథ. కథను నడిపించే పాత్రలు ఉంటాయి’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : పవన్, సినిమాటోగ్రఫీ : జితిన్ మోహన్, ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర, కాస్ట్యూమ్ డిజైనర్ : ముగ్ధా రాచకొండ.