Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్అంగరంగ వైభవంగా కట్టమైసమ్మ జాతర

అంగరంగ వైభవంగా కట్టమైసమ్మ జాతర

- Advertisement -

నవతెలంగాణ – శామీర్ పేట : సోమవారం శామీర్ పేట్ కట్ట మైసమ్మ జాతర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, సర్వు గంప ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.  అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ  చేశారు. కాగా  మల్కాజ్ గిరి ఎంపి ఈటెల రాజేందర్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్ పలువురు ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్దలు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -