Sunday, October 12, 2025
E-PAPER
Homeకరీంనగర్కౌన్ బనేగా సీటు కా షేర్..

కౌన్ బనేగా సీటు కా షేర్..

- Advertisement -

రేపు జిల్లాకు పరిశీలకుల రాక..
తమకే అధ్యక్ష పదవిని ఎవరికి వారే అనుకుంటున్నా నేతలు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీంట్లో భాగంగానే జిల్లాకు నేడు పరిశీలకులు రానున్నారు. రెండు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో నేతలు జిల్లా అధ్యక్ష పదవి తమకే వస్తుందని ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. జిల్లాలోని కాంగ్రెస్ నేతల్లో సందడి నెలకొంది. ఇప్పటికే జిల్లాలో నామినేటెడ్ పదవులు కానీ పార్టీ పదవులు కానీ పూర్తిస్థాయిలో భర్తీ చేయకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహంగా ఉన్నారు. జిల్లా అధ్యక్ష పదవి భర్తీపై మళ్ళీ జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొంత చలనం మొదలైంది. పార్టీని మొదటి నుంచి తాము నడిపించామని తమకే అవకాశం కల్పించాలని కొంతమంది నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా తాము పార్టీలోకి వచ్చిన తర్వాతే జిల్లాలో పార్టీ బలోపేతం అయిందని మరికొంతమంది తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి బరిలో నేతలు…

రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడిన సమయంలో మొట్టమొదట జిల్లా అధ్యక్షుడిగా నాగుల సత్యనారాయణ గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది తర్వాత ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవి ఆశించడంలో నేతలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కనిమేని చక్రధర్ రెడ్డి, చీటీ ఉమేష్ రావు సంగీతం శ్రీనివాస్ గడ్డం నరసయ్య కూస రవీందర్ నేవూరి వెంకట్ రెడ్డి లు జిల్లా అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో పాటు మరికొంతమంది కూడా తమకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని నేతలను కోరుతున్నారు కానీ ప్రధానంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ల ఆశీస్సులు ఎవరిపైన ఉంటే వారికే ఈ జిల్లా అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారు వీరిద్దరిని కలవడంతోపాటు మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందో అని జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.

ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవికి ఆశావాహుల నుంచి నేడు ఉమ్మడి జిల్లాకు రానున్న పరిశీలకులు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది దరఖాస్తులు తీసుకున్న తర్వాత అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న వారి పనితీరును పరిశీలకులు అడిగి తెలుసుకోనున్నారు. పార్టీ అధిష్టానం మాత్రం పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజా మద్దతు ఉన్న నాయకుడిని గుర్తించి డిసిసి అధ్యక్షుడిగా నియమించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏఐసీసీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చిట్ల సత్యనారాయణ ను పరిశీలకునిగా పంపించనుంది ఆరు రోజులపాటు చిట్ల సత్యనారాయణ తో పాటు మరి కొంతమంది జిల్లాలో పర్యటించనున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో నుంచి ముగ్గురి పేర్లను ఈ పరిశీలకులు ఎంపిక చేసి ఏఐసీసీకి పంపించనున్నారు. ముగ్గురు పేర్ల జాబితాను  వారు పరిశీలించిన అనంతరం టీపీసీసీకి పంపించే అవకాశం ఉంది. ఆ ముగ్గురి పేర్లను ముఖ్యమంత్రి, మంత్రులు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి లు కలిసి ఒక పేరును ఫైనల్ చేసి కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా ప్రకటించే అవకాశం ఉంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -