పలువురు సభ్యుల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై అసెంబ్లీలో ఆదివారం దుమారం చెలరేగింది. కడియం శ్రీహరిపై ఆయన వ్యవహరించిన తీరును అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. కడియం మాట్లాడుతున్న సమయంలో కౌశిక్‌రెడ్డి ఆయనవైపు వేలు చూపిస్తూ తుపాకీతో కాల్చుతానంటూ సైగలు చేయడం, హావభావాలు తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ విషయంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డి గూండాగిరీ చేయడం సరైంది కాదన్నారు. దళితులు, గిరిజనులకు చట్టసభల్లోనే గౌరవం లేకపోతే ఎలా?అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సభ్యులు బాలునాయక్, ఎడ్మ బొజ్జు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యన్నారాయణ, పాయం వెంకటేశ్వర్లు, వంశీకృష్ణ, యశస్వినిరెడ్డి, మట్టా రాగమయి దయానంద్, మురళీనాయక్, వేముల వీరేశం, రామచంద్రనాయక్, గడ్డం వినోద్ మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డిని ఈ టర్మ్‌లో శాశ్వతంగా సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరికి క్షమాపణ చెప్పాలని కోరారు. ఆయన చట్టసభల్లో రౌడీలాగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దళితులు, గిరిజనుల జోలికొస్తే కత్తుల కోలాటం ఆడతామని మందుల సామేల్ హెచ్చరించారు. కౌశిక్‌రెడ్డి అసెంబ్లీలో నక్సలైట్‌గా మారిండని వంశీకృష్ణ అన్నారు. ఆయన ఎమ్మెల్యేలాగా కాకుండా వీధిరౌడీలాగా వ్యవహరించారని కేఆర్ నాగరాజు చెప్పారు. బీఆర్‌ఎస్ సభ్యులు కోఠి, అబిడ్స్‌లో చప్పట్లు కొట్టాలని కాలె యాదయ్య అన్నారు.
కౌశిక్‌రెడ్డిని శాశ్వతంగా సస్పెండ్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



