రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి
నవతెలంగాణ – దర్పల్లి
ఆత్మాభిమాణం పేర అసెంబ్లీలో కవిత కన్నీరు పెట్టుకోవడం ఒక డ్రామా అని ,కెసిఆర్ దోచుకున్న దాంట్లో తనకు వాటా ఇవ్వకపోవడం అసలు విషయం అని రూరల్ ఎమ్మెల్యే డా,భూయపతి రెడ్డి విమర్శించారు. ఈ సందర్బంగా ఆయన మండల కేంద్రములోని ఎంపీడిఒ కార్యాలయ ఆవరణలో అధికారులు ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి చెక్కుల కార్యక్రమములో ఆయన దర్పల్లి, సిరికొండ, ఇందాలవాయి మండలాలకు చెందిన 2 వందల కుటుంబాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కు సంబందించి రెండుకోట్ల చెక్కులని పంపిణీ చేశారు.
అనంతరం కార్యక్రమములో ఆయన మాట్లాడుతూ కవిత కన్నీరు పెట్టుకోవడం అంతా డ్రామా అని విమర్శించారు. కెసిఆర్ తెలంగాణ రాస్ట్రం అప్పులపాలు చేసి దోచుకున్న సొమ్ములో తనకు వాటా ఇవ్వలేదని కన్నీరు పెట్టుకుందని ఆగ్రహం వెక్తం చేశారు.గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ద్రోహులకు ఆసరా ఇచ్చింది కవిత కదా అని ప్రశ్నించారు. నాలాంటి వారు ఎందరికో కన్నీళ్ళు పెట్టుకురు
అప్పుడు కనిపించలేద ఆత్మగౌరవం అని ప్రశ్నించారు. 9 లక్షల కోట్ల భారాన్ని తెలంగాణపై రుద్ది హాయిగా ఫామ్ హౌస్ లో పడుకొని రాహుల్ గాంధీ వారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సిగ్గు చేతన్నారు. అసలు వారి ముందు నిస్తాయి ఏమిటని ప్రశ్నించారు. దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన కుటుంభం వారిది ఐన ఇప్పటికీ వారికి ఉండేందుకు స్వంత ఇల్లు లేని కుటుంబాన్ని పట్టుకొని ఇలా అహంకార ధోరణితో మాట్లాడుతె ప్రజలు చీరి దోరణం కట్టుతారని అన్నారు. ఖబర్డర్ కెసిఆర్ మరో సారి ఇలా ప్రవర్తిస్తే మాపార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. అప్పులెన్ని ఉన్న ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటొకటిగా 6 గ్యారంటీలను అమలు పరుస్తున్నారని అన్నారు.
నేడు మహిళలకు స్వశక్తి పేరుతో మహిళలకు మిత్తి లేని రుణాలు అందించి వారిని వారి కాళ్ళపై వారిని నిలబెట్టి సమాజంలో తలెత్తుకొని తిరిగెల ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు,సన్నబియ్యం,ఉచిత కరెంటు,ఉచిత బస్సు ,దేశ విదేశాలతో వెలకోట్ల పెట్టుబడులతో రస్త్రాన్ని అన్నీ విధాలా అభివృద్ది చేయడం జరుగుతుందని అన్నారు. ఇంతటి అభివృద్దిని చూసి ఓర్వలేక బిఆర్ఎస్ వాళ్ళకు కండ్లు మండుతున్నాయని అన్నారు. బిజేపి వాళ్ళు దేశాన్ని అమ్ముకుంటూన్నారు. వాళ్ళకూడ కాంగ్రెస్ పై మాట్లాడుతున్నారని ,రాస్ట్రా యువతకు ఉద్యోగాలు ,రైసింగ్ తెలంగాణగా గ్లోబల్ సిటీగా అభివృద్ది చెందుతుందని అన్నారు. రానున్న రోజుల్లో స్థలాలు లేని వారికి 75 గజాల స్థలంలో ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అనంతరం మండలంలోని రామడుగు ప్రాజెక్ట్ ఆయకట్టు కింది వరి పొలాలకు సాగు నీటిని వదిలారు. దమ్మన్నపేట గ్రామములో ఇటీవల అనారోగ్యము వల్ల మరణించిన రెండు కుటుంబాలకు పరామర్శించారు.
కార్యక్రమములో పిసిసి డెలికెట్ శేఖర్ గౌడ్,మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ ,ఇమ్మది గోపి,దర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్,మాజీ సొసైటీ చెరమేన చెలిమెల మల్లికార్జు ,జనార్ధన్ రెడ్డి,తహసీల్దార్ టి శాంత,ఎంపీడివ లక్ష్మారెడ్డి,అయ్యశాఖల అధికారులు,ఇటీవల కొత్తగా ఎన్నుకోబడ్డ అన్నీ గ్రామాల సర్పంచులు ,వార్డు సభ్యులు,మండల నాయకులు,లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.



