- Advertisement -
నవతెలంగాణ – భీంగల్నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం నింబాచల క్షేత్రంపై స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్బంగా బుధవారం శ్రీ లక్మీ నృసింహునిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్బంగా క్షేత్రానికి ఉదయం చేరుకున్న కవిత గర్భాలయంలోని శ్రీ లక్మీ నృసింహున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కు స్వాగతం పలికారు.ఆలయ విశిష్టత గురించి వివరించారు. స్వాముల వారికి ప్రత్యేక పూజలు జరిపి స్వామి అంక్షింతలు, తీర్థ, ప్రసాదం అందజేశారు.
- Advertisement -



