గూలాబీకి గుబులు పుట్టిస్తున్న కవిత నిర్ణయం!?
నవతెలంగాణ హైదరాబాద్: కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడదే నిర్ణయం బీఆర్ఎస్ ను కలవర పెడుతుందంట.తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన వేళ కవిత నిర్ణయం గూలాబీ శ్రేణులలో గుబులు పుట్టిస్తుంది. కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. బీఆర్ఎస్ టికెట్ ఆశించి దక్కని నాయకులు జాగృతి వైపు మొగ్గు చూపితే ఓట్లు చీలిపోతాయని, దీంతో పార్టీకి నష్టం జరుగుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటినట్లే, ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.