నవతెలంగాణ – హైదరాబాద్: కాళేశ్వరం అవినీతిలో కవితకు కూడా వాటా ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ నిర్ణయాలతోనే కాళేశ్వరం కూలిందన్నారు.. కవిత కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారని గుర్తుచేశారు. ప్రజలు దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ ఫ్యామిలీ డ్రామాలాడుతోందన్నారు. సీబీఐ విచారణలో కేసీఆర్ కుటుంబ దోపిడి బయటపడుతుందన్నారు. పదేళ్లు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందన్నారు. అధికారంలో ఉన్నపుడు హరీశ్ అవినీతిపై కవిత ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏనాడైనా కేసీఆర్ కు హరీశ్ మీద ఎందుకు కవిత కంప్లైంట్ చేయలేదన్నారు. వాటాలల్లో తేడాలొచ్చినపుడే కవిత విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మొన్నటి వరకు కేటీఆర్ పై విమర్శలు చేసిన కవిత ఇపుడు హరీశ్, సంతోష్ లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు.
కాళేశ్వరం అవినీతిలో కవితకు కూడా వాటా: టీపీసీసీ చీఫ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES