తహసిల్దార్ చందా నరేష్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోనీ మునిగలవీడు గ్రామంలో నీ 159 వ బిఎల్వో గా జే, కవిత ఉత్తమ బిఎల్ఓ గా ఎంపికై అవార్డు అందుకున్నట్లు తాహసిల్దారు చందా నరేష్ తెలిపారు. గురువారం తాహసిల్దార్ కార్యాలయంలోని ఉత్తమ బి ఎల్ ఓ గా ఎంపికైన సందర్భంగా అభినందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బి ఎల్ ఓ గా కవిత సరైన సమయానికి చెప్పిన విధంగా రిపోర్ట్ అందించి సక్రమంగా బి ఎల్ ఓ గా విధులు నిర్వహించారని, అందుకోసం ఆమె ఉత్తమ బి ఎల్ వో గా ఎంపిక అయిందని ఆమెకు ఉత్తమ అవార్డును అందించామని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా మంచిగా విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ శ్రీనాథ్ ఆర్ ఐ రామకృష్ణ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ మోటాపోతుల నాగేందర్ జిపిఓల సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తమ బిఎల్ఓ అవార్డు అందుకున్న కవిత
- Advertisement -
- Advertisement -



