నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను రాసిన లేఖ లీక్ కావడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ను దేవుడితో పోల్చిన ఆమె, ఆయన చుట్టూ కొందరు దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్‌కు లేఖ రాసిన మాట వాస్తవమేనని కవిత అంగీకరించారు. సుమారు రెండు వారాల క్రితమే ఈ లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. అయితే, ఆ లేఖలో తన వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని, కేవలం పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను మాత్రమే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశానని స్పష్టం చేశారు. “ఆ లేఖ నాదే, అందులో నా వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. కార్యకర్తల అభిప్రాయాలు మాత్రమే చెప్పాను” అని కవిత పేర్కొన్నారు. అంతర్గతంగా తాను రాసిన లేఖ బయటకు రావడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక కచ్చితంగా కుట్ర ఉందని ఆరోపించారు.
కేసీఆర్ కు రాసిన లేఖపై స్పందించిన కవిత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES