- Advertisement -
- అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు
- సీఎంపై అభాండాలు వేయడం సరైందికాదు : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…కేసీఆర్ వదిలిన బాణం అని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ సందేహం వ్యక్తం చేశారు. ఆమె అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై లేనిపోని అభాండాలు వేయడం సరైందికాదని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంలో కవిత కొత్త నాటకం ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు కేసీఆర్ కుటుంబం ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఆమె రాజీనామా చేయడం శుభ పరిణామంగా తాము భావిస్తున్నాయని తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు తుది నిర్ణయం తీసుకునే బృందంలో కవిత కూడా ఒకరని గుర్తు చేశారు. కవిత ప్రమేయం లేకుండా అవినీతి జరిగిందా? అని ప్రశ్నించారు. ఐదేండ్ల ముందు కవిత రాజీనామా చేసి ఉంటే ప్రజలు అంగీకరించేవారని తెలిపారు. పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతిలో కవిత భాగస్వామ్యం ఉందని చెప్పారు. సంతోష్‌రావు, హరీశ్‌రావు వెనక ఉండాల్సిన అవసరం రేవంత్‌రెడ్డికి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో ఆమె దోచుకుని, దాచుకున్నారనీ, ఇప్పుడేమో కవిత నీతి వ్యాఖ్యాలు వల్లే వేస్తున్నారని విమర్శించారు. అవినీతిపరుల విషయాల్లో తలదూర్చడం మాకిష్టం లేదని చెప్పారు. అవినీతి పరులను ఒకే కోణంలో చూస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ ఉండదని అనుమానం వ్యక్తం చేశారు. కవిత అమెరికా వెళ్లి రాగానే తన వైఖరి ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఇప్పుడు తన బానాన్ని కేటీఆర్‌పై కాకుండా హరీశ్‌రావుపై ఎందుకు ఎక్కు పెట్టారని ఆయన ప్రశ్నించారు.
ప్రతి మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాలను ఇవ్వండి : మహేశ్‌కుమార్‌గౌడ్‌కు వికలాంగుల వినతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాలను వికలాంగులకు కేటాయించాలని వికలాంగుల ప్రాతినిధ్య సాధన కమిటీ కోరింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మహేశ్‌కుమార్‌ను కలిసి వారు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంలో తగిన చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -