– అభినందించిన గ్రామస్తులు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని 11, 9వ వార్డుల లింగాపూర్ గ్రామ పరిధిలో ఉన్న చెరువు ఇరువైపులా కావ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సుమారు 500 చెట్లు నాటారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుంతలు తవ్వి మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను సంఘ సభ్యులే స్వయంగా తీసుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ .. పై అధికారుల ఆదేశాలతో ఈ కార్యక్రమాల నిర్వహించినట్లు వారు తెలిపారు.
మీరు చేసిన కార్యక్రమాన్ని చూసి అవార్డులోని ప్రజలు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షురాలు చక్రపాణి సంతోషి, కారం పూడి అన్నపూర్ణ, వైద్య ఉమారాణి, సత్తు అపర్ణ, మంచాల లక్ష్మి, మహాబున, అనంత, గౌతమి, రజిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



