నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కొత్త చెరువు తండా గ్రామంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందుల కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లకావత్ సంతోష్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు గొర్రెలు మేకలకు నట్టల నివారణ ద్రావణాన్ని తాగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు మాట్లాడుతూ గొర్రెలు, మేకలకు సకాలంలో నట్టల నివారణ మందులు వేసుకోవాలని సూచించారు. ప్రతి నాలుగు నెలలకోసారి తప్పకుండా నట్టల నివారణ మందులు వేయించాలని గొర్రెలు, మేకల కాపరులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో3314 గొర్రెలకు, 946 మేకలకు నట్టల నివారణ మందులు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది వెటర్నరీ అసిస్టెంట్ ప్రవీణ్ రెడ్డి, గోపాలమిత్ర స్పరన్, గొర్రెల మేకల కాపరులు, తదితరులు పాల్గొన్నారు.
కేసి తాండలో నట్టల నివారణ కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



