నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ గ్రామంలో కొత్తచెరువు తండా సర్పంచ్ సంతోష్, ఉపసర్పంచ్ గుగ్లోత్ రమేష్ సహకారంతో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా కేసి తండా సర్పంచ్ టీం నిలిచింది. కోనాపూర్ వాలీబాల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1లో భాగంగా నిర్వహించిన ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో 5 ప్రాంచెజెస్ టీంలు పాల్గొన్నారు. కేసిటిఎస్ఎస్ కేసి తండా సర్పంచ్ టీం ఛాంపియన్ గా నిలువగా, ఎస్ఎన్ జివై టీం రన్నర్ గా నిలిచింది. నిర్వహించిన టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన జట్లకు కొత్తచెరువు తండా సర్పంచ్ సంతోష్ చేతుల మీదుగా కప్ తో పాటు నగదు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో యువతలో దాగి ఉన్న క్రీడ నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం ద్వారా తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి కీడా టోర్నమెంట్ లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజేత జట్ల టీం సభ్యులను ఆయన అభినందించారు.



