నవతెలంగాణ-చిన్నకోడూరు
కేసీఆర్, హరీష్ రావుల తోటే కాలేశ్వరం ప్రాజెక్టు సాధ్యమైందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మెట్టుపల్లి సలెంద్రి గ్రామాల మధ్య రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసిన కాలువ వద్ద సర్పంచ్ ధర్మాజీపేట తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్, హరీష్ రావులకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం రెండు గ్రామాల సర్పంచ్, ప్రజలు హరీష్ రావును కలిసి గోడు వెలిబుచుకోవడంతో హరీష్ రావు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రెండు గ్రామాల మధ్య ఉన్న కాల్వకు నీరును వదిలే విధంగా ఆదేశాలను జారీ చేశారు. నీటిని వదలడంతో రెండు గ్రామాల రైతులు ఆనందంలో మునిగిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, గంగాపూర్ సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు, చిన్నకోడూరు సర్పంచ్ ఇట్టబోయిన శ్రీనివాస్, మెట్టుపల్లి ఉప సర్పంచ్ దూల్మిట్ట మహేష్, బీఆర్ఎస్ నాయకులు కాముని ఉమేష్ చంద్ర, కొత్త శంకర్, ఏడబోయిన రాజయ్య, కొత్త నరహరి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్, హరీష్ రావులకు పాలాభిషేకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



