నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి 1989, 1994లో రెండుసార్లు సీపీఐ(ఎం) నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ శాసనసభ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారని గుర్తు చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కూలీ పని చేసిన శ్రమజీవిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా ఎదిగి, ప్రజాదరణతో రెండు దఫాలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొన్నారు. నిరాడంబర జీవితాన్ని గడిపిన ఆయన ప్రజల మనిషిగా గుర్తింపు పొందారని తెలిపారు.
ఆయన రాజకీయ జీవితం, భవిష్యత్ తరానికి ఆదర్శవంతమైనదని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
హెచ్‌జె దొర మృతికి కేసీఆర్ సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జె దొర మరణం పట్ల కేసీఆర్ సంతాపం తెలిపారు. పోలీసు శాఖలో పలు హోదాల్లో బాధ్యతలను చేపట్టి, వినూత్న సంస్కరణలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం హెచ్‌జె దొర విశేష కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కొండిగారి రాములు మృతికి కేసీఆర్, కేటీఆర్ సంతాపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



