Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష  

తెలంగాణకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష  

- Advertisement -

– కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ 
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేవైఎం నాయకులు బిజెపి పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ అభివృద్ధి చెందుతుందని బిఆర్ఎస్ పార్టీ లో మంగళవారం చేరారు. బిఆర్ఎస్ పట్టణ యువజన విభాగం అధ్యక్షులు చెలిమెల భాను ప్రసాద్ ఆధ్వర్యంలో గంప గోవర్ధన్  చేతుల మీదుగా బొంబాయి సాయి ప్రమోద్ రెడ్డి  మిత్ర బృందానికి బిఆర్ఎస్ కండువా వేసి పార్టీలోకి సాదరంగా మించిన గంప గోవర్ధన్. ఈ సందర్భంగా కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్  మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని అన్నారు.

ఈ మోసాన్ని చూసి బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందినటువంటి యువకులు బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిను చూసి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ కేసీఆర్, బిఆర్ఎస్ అని అన్నారు. రాబోవు రోజుల్లో కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై యువకులందరినీ సమీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాపోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి,  ఉపాధ్యక్షులు గడికింది చంద్రకాంత్, కోశాధికారి సాయి, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మాజీధ్, యూత్ నాయకులు బాబా గౌడ్, సమీర్ సాయి, బషీర్, అమాన్ తో పాటు 20 మంది బిజెపి నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -