- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్ దగ్గర గుల్జార్‌హౌస్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలు కాపాడాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తగిన ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
- Advertisement -