హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ వాదన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రూ.85 వేల కోట్ల అంచనాతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1.47 లక్షల కోట్లు ఖర్చు చేశారనీ, ఇంత చేసినప్పటికీ మేడిగడ్డ వద్ద పిల్లర్ కుంగుబాటు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పత్రికల్లో కథనాలు వచ్చినందున తమ ప్రతిష్ట దెబ్బతిందని పిటిషనర్లు ఆందోళనతో కోర్టుకు వచ్చారని పేర్కొంది. కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారనీ, నివేదిక వచ్చాక కమిషన్ ఏర్పాటు జీవో 6 ను సవాల్ చేశారని ఆక్షేపించింది. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ ఏర్పాటుకు ఇచ్చిన జీవో 6ను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్, ఐఏఎస్ స్మితా సబర్వాల్, రిటైర్డు ఐఏఎస్ జోషి వేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ సోమవారం విచారించింది. ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందని వివరించారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణమైనవాళ్లు ఎవరో తేలాల్సివుందనీ, కమిషన్ ఏర్పాటు జీవో జారీ సమయంలో ఆ ప్రక్రియకు హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేయలేదని అన్నారు. ప్రజా ప్రయోజనాల నేపథ్యంలో నిజనిర్ధారణ కోసం కమిషన్ ఏర్పాటు అయ్యిందన్నారు. పిటిషనర్లు ఎందుకు భయడపతు న్నారో అర్ధం కావడం లేదని చెప్పారు. కమిషన్ నోటీసు ఇస్తే సవాల్ చేయలేదనీ, కమిషన్ విచారణకు సహకరించిన హరీశ్‌రావు నివేదికను సవాల్ చేయడంలో ఆంతర్యం ఏంటో తెలియడం లేదన్నారు. కమిషన్ ఏర్పాటు నిబంధనలోనే బాధ్యులను గుర్తించాలని ఉందని గుర్తు చేశారు. పిటిషనర్ కోరిన వివరాలన్నీ నోటీసు ద్వారా విచారణకు పిలిచినట్టు చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో బ్యారేజీ నిర్మాణంలోని లోపాల గురించి పేర్కొందని వివరించారు. ప్రధానంగా నిపుణుల కమిటీ పరిశీలించి మేడిగడ్డలో రిజర్వాయర్ నిర్మాణం చేయొద్దని తేల్చి చెప్పినప్పటికీ గత ప్రభుత్వ అధినేత కేసీఆర్ ఖాతరు చేయలేదని అన్నారు. క్యాబినెట్‌లో చర్చ చేయలేదనీ, ఆమోదం కూడా లేదని చెప్పారు. నిర్మాణం చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఆమోదం తీసుకోలేదని అన్నారు. ఈ అంశంపై వాదనలు మంగళవారం కొనసాగనున్నాయి.
దర్గా తరలింపుపై హైకోర్టులో పిటిషన్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని దర్గా తరలింపు ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలను అందజేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, వక్ఫ్ బోర్డు సీఈవో, జిల్లా ఎస్సీ, వేములవాడ ఆలయ ఈవోలను ఆదేశించింది. వేములవాడలోని దర్గా తరలింపు చర్యలను సవాల్ చేస్తూ నజీమా వేసిన పిటిషన్‌ను జస్టిస్ బి విజరుసేన్‌రెడ్డి సోమవారం విచారించారు. వేములవాడలో రాజరాజేశ్వరి ఆలయం చాలా ప్రసిద్ధి చెందినదనీ, భక్తుల తాకిడి పెరుగుతున్నందున వాళ్లకు వసతుల కల్పన కోసం ప్రార్థనా మందిరాన్ని వసతులున్న మరోచోట కేటాయింపు జరిగిందని వివరించారు. ఇదేమీ వేరే మతానికి వ్యతిరేకం కానేకాదని చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకే దర్గా తరలింపు జరుగుతోందని అన్నారు. ప్రభుత్వ వివరణ కోసం విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది.
భయంతోనే కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



