నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.8.15 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆ డబ్బంతా ఎక్కడకి పోయిందో కూడా తెలియడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన మే డే వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే తమ ప్రభుత్వం కొత్తగా రూ.1.58 లక్షల కోట్లు రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా విచ్చలవిడిగా అప్పులు చేసిందని ఆరోపించారు. సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని, ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందిస్తున్నామని, తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ రెడ్డి మరో సారి గుర్తు చేశారు.
కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారు: సీఎం రేవంత్
- Advertisement -
RELATED ARTICLES