Friday, July 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించిందే కేసీఆర్‌

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించిందే కేసీఆర్‌

- Advertisement -

– టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

కేసీఆర్‌ అధికారంలో ఉన్న సమయంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు. పదేండ్లు అధికారంలో ఉండి ఆయన బీసీలకు ఏం సాధించారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖర్గేకు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆ లేఖ జాగృతి తరుపున రాశారా? లేక బీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున రాశారా? ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్థానిక సంస్థలతోపాటు విద్య, వైద్య రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్‌ అమలు చేసిందని గుర్తు చేశారు. ఆపార్టీ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించే సమయంలో కవిత లిక్కర్‌ కేసులో జైల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో విఫలమైనందు వల్లే బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడించారని తెలిపారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు. శుక్రవారం ఎల్బీస్టేడియంలో తలపెట్టిన సామాజిక సమరభేరి సభకు గ్రామ, మండల, జిల్లా అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లతో సహా 40వేల మంది హాజరు కానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఖర్గే గ్రామ అధ్యక్షులకు దిశా నిర్దేశం చేస్తారని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -